– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ పై సంతకాలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ మీ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహసిల్దార్ లను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు. గురువారం వేల్పూర్ లోని తన స్వగృహంలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్న 207 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై ఆయన సంతకాలు చేశారు.
వీటిలో కమ్మర్ పల్లి (28), బాల్కొండ (38), ముప్కాల్ (07), మోర్తాడ్ (29), వేల్పూర్ (55),మెండోర (17),భీంగల్ (21), ఏర్గట్ల (12) మండలాలకు చెందిన మొత్తం 207 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.ఈ సందర్బంగా సంతకాలు పూర్తయిన ఫైల్స్ మీ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహసిల్దార్ లను అదేశించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్ లు పాల్గొన్నారు.



