నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన జి. భరత్ రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు అమీర్ నగర్ కబడ్డి టీం కోచ్ బెరిగిడి శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలలో భరత్ పాల్గొంటారని తెలిపారు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ అమీర్ నగర్ కబడ్డి టీం కోచ్ బెరిగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాణించి రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపికవ్వడం పట్ల గ్రామానికి చెందిన ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ రవీందర్ నాయక్, గ్రామ సర్పంచ్ నీలవేణి దశరత్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ రాజేందేర్, గుర్రం నరేష్, నర్సింలు, గణేష్, రంజిత్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భరత్ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. మున్ముందు గ్రామానికి చెందిన ఎంతో మంది క్రీడాకారులు గ్రామం నుండి పై స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు అమీర్ నగర్ విద్యార్థి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



