నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన 2002–03 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన స్నేహితుడు ఎస్. మల్లయ్య అకాల మరణం పట్ల ఆయన బాల్య మిత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లయ్య కుటుంబానికి అండగా నిలుస్తూ బ్యాచ్‌కు చెందిన మిత్రులు కలిసి శనివారం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, మల్లయ్య మరణం తమకు తీరని లోటని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లయ్య కుటుంబానికి తమ వంతు బాధ్యతగా ఈ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
అవసరమైతే భవిష్యత్తులో కూడా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో కాశన్న, వెంకటయ్య, మల్లయ్య, పరుశురాములు, అర్జున్, బాలయ్య, బంగారయ్య తదితర బాల్య మిత్రులు పాల్గొన్నారు.



