Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొలాల్లో గెట్లను తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

పొలాల్లో గెట్లను తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

తహశీల్దార్ కు వినతిపత్రం అందించిన భూ పట్టాదారులు
నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని మైసమ్మ చెరువు కింద ఉన్న భూముల్లో గత కొన్ని రోజులుగా గౌడ్ అనే వ్యక్తి మా భూముల్లో అక్రమంగా గెట్లను తొలగిస్తున్నాడని స్తానిక రైతులు తహశీల్దార్ కు వినతి ప్రతం అందజేశారు. తనకున్న మూడెకరాల భూమితో పాటు ఆయన పొలానికి ఆనుకుని ఉన్న చుట్టుపక్కల రైతుల పొలాలోని ఒడ్లను తొలగించి, దాదాపుగా 20 ఎకరాలకు పైగా కబ్జా చేశాడని రైతులు ఆరోపించారు. దీంతో వెంటనే స్పందించిన తహశీల్దార్ కబ్జాకు గురైన భూములను పరిశీలించాలని సర్వేయర్ వెంకట్రావును ఆదేశించారు.

ఈ క్రమంలో సర్వేయర్ తన సిబ్బందితో వచ్చి గెట్లను తొలగించిన భూములను పరిశీలించారు. అనంతరం దాదాపుగా 20 ఎకరాలకు పైగా ఒడ్లను తొలగించిన విషయం నిజమేనని, గెట్లు తొలగించినందును ఎవరి భూమి ఎక్కడ ఉందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని సర్వేయర్ తహశీల్దార్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. రైతుల పొలాల్లో అక్రమంగా గెట్లు తొలగించి, భూకబ్జాకు సిద్ధపడ్డ వక్తికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా భూపట్టాదారులకు సరైనా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -