- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా నియామకమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిన్నతూండ్ల సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం జంగిడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ..ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా సంయుక్తంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బెల్లంకొండ జ్యోష్ణ-నవీన్ రావు, బొమ్మ రజిత-రమేష్, అబ్బినేని లింగస్వామి, కాంగ్రెస్ నాయకుడు వేల్పుల రవి పాల్గొన్నారు.
- Advertisement -



