Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దతు ధర కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలి: ఎమ్మెల్యే

మద్దతు ధర కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
కంది పంట మద్దతు ధర కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గురువారం రాత్రి మార్కెట్ యార్డులో ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంది పంట రైతులు పండించిన తమ పంటను మద్దతు ధర కేంద్రాల్లోని అమ్ముకోవాలని సూచించారు. దళారులకు అమ్ముకొని మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, ఎఫ్ పిఓ చైర్మన్ చాట్ల గోపాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, సలాబత్పూర్ ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్, మార్కెట్ కమిటీ సెక్రటరీ, మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -