సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఈనెల 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా ‘ఊసులాడే..’ అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమను తెలియజేసే ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరా రాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. రిషి.ఎం సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీలోని ‘ఊసులాడే..’ సాంగ్‌ను భాస్కరభట్ల రాయగా, ఆదిత్య, సమీర భరద్వాజ్ పాడారు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, మూవీ టైటిల్ సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ ‘ఊసులాడే..’ సాంగ్ రిలీజ్ కాగా.. దీనికి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను తెలియజేసేలా సినిమాను రూపొందించామని, తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ తెలియజేశారు. సాయి సింహాద్రి, మీరా రాజ్, వినోద్ కుమార్, వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.ఆర్.కె. నాయుడు, మ్యూజిక్: రిషి ఎం, ఎడిటర్: అమర్‌నాథ్, ఆర్ట్: బత్తుల సాహిత్ కుమార్, కొరియోగ్రఫీ: రాజ్ పైడి.
‘సన్ ఆఫ్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



