Sunday, June 21, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

- Advertisement -

– ఘనంగా నిర్వహించిన యాజమాన్యం 
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్ కుమార్ మార్గదర్శకత్వంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి. ఝాన్సీ రాణి మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో యోగా దివ్యౌషధంలా పనిచేస్తుందని అన్నారు.ఆరోగ్యకరమైన,సంపూర్ణ జీవనశైలిని పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

యోగా ఆసనాల ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరగడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి, ఊపిరితిత్తుల సామర్థ్యం వృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన సౌజన్య (ద్వితీయ సంవత్సరం),ఇర్ఫాన్ (మొదటి సంవత్సరం) లకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ ప్రసాద్, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రావణ్, బోధనేతర సిబ్బంది,విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -