Friday, September 11, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్ కమిషనర్‌ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే తాటి

మున్సిపల్ కమిషనర్‌ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే తాటి

- Advertisement -

– పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, తన్నీరు హరీశ్ రావు ఈ నెల 23 న అశ్వారావుపేట లో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు కోసం అనుమతి మంజూరు చేయాలని కోరుతూ కమిషనర్‌ కు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దరఖాస్తు సమర్పించారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు హరీశ్ రావు అశ్వారావుపేటకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొల్లి రవికిరణ్, డాక్టర్ భూక్యా ఉదయ జ్యోతి, నాయకులు డాక్టర్ భూక్యా ప్రసాద్, సత్యవరపు సంపూర్ణ, శెట్టిపల్లి రఘురామ్, అఖిల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -