Monday, June 22, 2026
E-PAPER
Homeమానవిబిడ్డ పుట్టిన తర్వాత…

బిడ్డ పుట్టిన తర్వాత…

- Advertisement -

డెలివరీ తర్వాత వచ్చే సమస్యల్ని దూరం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేస్తూ క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని చేర్చుకుంటే ప్రసవానంతరం త్వరగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. ​హ్యాపీ హర్మోన్లు : డెలివరీ తర్వాత శరీరం శక్తిని కోల్పోయి పూర్తిగా బలహీనపడుతుంది. అయితే ఈ శక్తిని తిరిగి కూడగట్టుకోవాలంటే.. వ్యాయామం చక్కటి మార్గం. వ్యాయామం చేసే క్రమంలో ఎండార్ఫిన్లు, డోపమైన్, సెరటోనిన్ వంటి హ్యాపీ హర్మోన్లు శరీరంలో విడుదలవుతాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచడంతో పాటు ప్రశాంతతను అందిస్తాయి.
​మానసిక ప్రశాంతతకు : బిడ్డకు జన్మనిచ్చాక నిద్రలేమి, అలసటతో తీవ్రమైన ఒత్తిడి ఎదురవటం అనేది అత్యంత సహజం. అయితే విభిన్న వ్యాయామాలు, యోగా వంటివి ఒత్తిడిని తరిమికొట్టి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇలా ప్రశాంతంగా ఉండడం వల్ల బిడ్డ ఎదుగుదలకు పరోక్షంగా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం ప్రసవానంతర అలసటను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు కూడా చెడుతున్నాయి. అలాగే ప్రసవం తర్వాత జీవిత నాణ్యతను కూడా పెంచవచ్చని ఆ అధ్యయనాలు తేల్చాయి. ​బరువు అదుపులో:

గర్భధారణ సమయంలో దృఢంగా ఉంచడానికి కొన్ని వ్యాయామాలు ఎలా మేలు చేస్తాయో.. ప్రసవానంతరం కూడా కొన్ని వర్కవుట్లు తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడంతో సహకరిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డెలివరీ తర్వాత అధిక బరువును తగ్గించుకోవడం, పొట్ట తగ్గించుకోవడంలో ఇవి మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. వ్యాయామం, యోగాతో కూడిన సరైన శారీరక శ్రమలో పాల్గొనడం బరువు నిర్వహణకు, కండరాల బలం పెంచడానికి సహాయపడుతుందని, తద్వారా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ పుట్టాక కొంతమంది తల్లులు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్లు వ్యాయామాలు చేయడం వల్ల సుఖంగా నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ​ఆరు వారాల తర్వాతే : అయితే డెలివరీ అయిన ఆరు వారాల తర్వాతనే వ్యాయామం మొదలు పెట్టమని నిపుణులు సూచిస్తున్నారు. అదికూడా ముందు ఓ సారి డాక్టర్ వద్ద ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకున్నాకే వ్యాయామం చేయాలని అంటున్నారు. బ్రిస్క్ వాకింగ్, ఈత, యోగా, సైక్లింగ్, పిలాటిస్, తక్కువ తీవ్రత ఉండే ఏరోబిక్ వ్యాయామాలు, పరుగు లేదా జాగింగ్ వంటివి ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, ఒకేసారి ఎక్కువ సమయం వ్యాయామాలు చేయకుండా.. క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవడం మంచిదంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -