Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహక్కుల కోసం ఐక్య పోరాటాలు

హక్కుల కోసం ఐక్య పోరాటాలు

- Advertisement -

హామీలను విస్మరిస్తున్న పాలకులు
భూమి పంచాలి.. కూలి రేట్లు పెంచాలి : బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు 
కె. కాంతయ్య
​న‌వ‌తెలంగాణ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌తినిధి

దేశంలో,రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతరంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు కె.కాంతయ్య అభిప్రాయపడ్డారు. ఆదివారం మహబూబ్ నగర్‌‌లోని అచ్యుతానందన్, సునీత్ చోప్రా నగర్‌లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మాసభలో ఆయన సౌహార్థ సందేశాన్ని ఇచ్చారు. పేదల బతుకులు నిలదొక్కుకోవడానికి సంక్షేమ పథకాలు తాత్కాలికంగానే దోహదపడతాయని చెప్పారు. వారికి భూమిని పంచితే ఆత్మగౌరవంతో బతుకుతారనీ, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలదొక్కు కుంటారని తెలిపారు. విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వ పరం చేసి ఉచితంగా అందిస్తే ప్రజల బాధలు సగం తగ్గుతాయని చెప్పారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభు త్వం వ్యవసాయ కూలీల గురించి మాత్రం కనీసం ఆలోచించట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కార్మికులకు వెంటనే రూ.12,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు. నరేగా చట్టం పరిరక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు వీబీ గ్రాం జీ పథకాన్ని మోడీ సర్కారు తీసుకొచ్చిందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -