నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శుక్రవారం ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా కంప్యూటర్లను బహుకరించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు రాపాక నాగరాజు స్వాతి దంపతులు ఈ కంప్యూటర్లను కళాశాల ప్రిన్సిపల్కు అందించడం జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, జనగామ ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఫోసిస్ సంస్థ అధిపతుల సుధా నారాయణమూర్తి ఆశయాల మేరకు హైదరాబాద్లో పనిచేస్తున్న రాపాక నాగరాజు మరియు స్వాతి దంపతులు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కొరకు మూడు కంప్యూటర్ సిస్టమ్ లను బహుకరణ చేయడం జరిగింది.
కంప్యూటర్ల దాత స్వాతి మాట్లాడుతూ నేటి కాలంలో కంప్యూటర్స్ విద్య ఎంతో అవసరం అని నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఉన్న కళాశాల విద్యార్థులకు కంప్యూటర్స్ అందించడం చాలా సంతోషం అని భవిష్యత్తులో ఇంకా కొన్ని కంప్యూటర్స్ అందించి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మా శెట్టి సంతోష్, రామిని జగదీష్, పడకంటి రవీందర్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



