Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటు

కోనాపూర్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం స్టూడెంట్స్ కౌన్సిల్, హౌస్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..స్టూడెంట్స్ కౌన్సిల్ ద్వారా పాఠశాలలో ఉదయం ప్రార్థన, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిరంతర పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం అమలు పర్యవేక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు వాలంటీర్ గా పని చేయడం జరుగుతుందన్నారు. వివిధ క్లబ్ లు ఎకో క్లబ్, బాలిక సాధికారత క్లబ్,  కౌమార భద్రతా క్లబ్, ప్రహరీ క్లబ్, డిజిటల్ లెర్నింగ్ క్లబ్, లైబ్రరీ క్లబ్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ క్లబ్ లతో అనుసంధానంగా ఉంటుందనీ తెలిపారు.

పాఠశాల విద్యార్థులను మొత్తం నాలుగు హౌస్ లు  అబ్దుల్ కలాం హౌస్, శకుంతల దేవి హౌస్, సివి రామన్ హౌస్, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ లుగా ఏర్పాటు చేసినట్లు వివరించారు.హౌస్ లకు ప్రత్యేకంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎన్నిక చేసినట్టు తెలిపారు. స్కూల్ లీడర్, డిప్యూటీ లీడర్ లని ఎన్నికల ద్వారా ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ క్లబ్ ల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లభిస్తుందన్నారు.జీవన నైపుణ్యాలు, వివిధ రకాలైన సహ పాఠ్య కార్యకలాపాల ద్వారా విద్యార్థులు సమగ్ర అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఉత్తమ దేశ పౌరులుగా తీర్చిదిద్దపడతారని తెలిపారు.

ప్రతినెల హౌస్ ల మధ్య క్విజ్, వివిధ పోటీ పరీక్షలు నిర్వహించి ఉత్తమ క్లబ్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారన్నారు.  సమగ్ర శిక్ష నిధుల ద్వారా క్లబ్, హౌస్ సిస్టం విద్యార్థులకు  అవసరమైన వివిధ రకాల బ్యాడ్జీలు, బ్లేజర్లు, జెండాలు ఇతర సామగ్రి  కొనుగోలు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -