– నాంపల్లి ప్రతిభకు రాష్ట్ర అవార్డు
నవతెలంగాణ – కామారెడ్డి
“ప్రతిభ ఎవరి సొత్తు కాదు” అన్న మాటను నిజం చేస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఎం. నాంపల్లి (ఆర్టిజన్ గ్రేడ్ -2.) రాష్ట్రస్థాయి బహుమతిని అందుకున్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యుత్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, (టీజీ ట్రాన్స్కో), తెలంగాణ రాష్ట్ర Southern పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎస్పీడీసీఎల్), తెలంగాణ స్టేట్ నార్తన్ ఆర్థర్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. నాంపల్లి “స్టేట్ సూపర్ డైలాగ్స్ ,మోనో యాక్షన్ మెన్” విభాగంలో రాష్ట్రస్థాయి తృతీయ బహుమతిని అందుకున్నారు.
ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్ రంగంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బహుమతి అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యుత్ కార్మికులు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సాంస్కృతిక రంగంలోనూ ముందంజలో ఉన్నారని నిరూపించుకునే అవకాశం కలగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్థానికులు, సహోద్యోగులు నాంపల్లిని అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.



