Monday, June 22, 2026
E-PAPER
Homeక్రైమ్చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన కోగిల బాలసమ్మయ్య (80) ఈనెల 19న పరకాల బస్టాండ్‌లో బస్సు దిగుతుండగా, హనుమకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ మేరకు పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -