నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మైసమ్మ చెరువు కింద గల 681/క, 693/ 709/ఈ సర్వేలో ఉన్న తొమ్మిది గుంటల భూమిలో దౌర్జన్యంగా సురేష్ గౌడ్, సుభాష్ గౌడ్, సుమంత్ గౌడ్ అనే ముగ్గురు అన్నదమ్ములు గెట్లను తొలగించిన విషయం తెలిసిందే. వీరికున్న మూడెకరాల భూమితో పాటు ఉన్న మిగతా రైతుల పొలాలను కూడా ఆక్రమించి, దౌర్జన్యంగా పట్టా చేసుకోవాలని చూస్తున్నారని బాదిత రైతులు ఆరోపించారు. ఈ దౌర్జన్యాలకు ఒడిగట్టిన ముగ్గురు అన్నదమ్ములపై చట్టరీత్యా చర్యలు తీసుకుని, మా భూములు మాకు పక్కా హద్దులతో గుర్తించి అప్పగించాలని బాదిత రైతులు సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహశీల్దార్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. వెంటనే స్పందించిన తహశీల్దార్ అక్రమ భూ ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుని, బాదితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
గెట్లు తొలగించిన అన్నదమ్ములపై ప్రజావాణిలో ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



