సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి : సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ఆపరేషన్ కగార్-2’ పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులను హతమార్చడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను తక్షణమే వెనక్కి తీసుకుని, కూంబింగ్‌ను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ విధించిన 40 రోజుల డెడ్‌లైన్ పేరుతో కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో రెండ్రోజులుగా సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే ఐదుగురు మావోయిస్టులు మరణించినట్టు ప్రచారం జరుగుతున్నదని తెలిపారు.
మరికొంత మంది అగ్రనేతల ప్రాణాలకు హాని కలిగించేలా గాలింపు చర్యలు కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. మావోయిస్టులు ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడంలేద నీ, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హింసాత్మక చర్యలను నిలిపివేసి, సమస్య పరిష్కారానికి మావోయిస్టు లు జనజీవన స్రవంతిలోకి వచ్చే విధంగా వారితో చర్చలు జరపాలనీ, దేశ వ్యాపితంగా తమ పార్టీతో పాటు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా హింసాత్మక మార్గాన్నే ఎంచుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. తక్షణమే ఈ మారణకాండను నిలిపేయాలనీ, అటవీ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలనీ, మావోయిస్టులతో చర్చలు జరపాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
‘ఆపరేషన్ కగార్-2’ పేరుతో మారణకాండను ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



