- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
ఉండడానికి గూడులేని నిరుపేదలకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తోందని మండలంలోని చిన్నతూoడ్ల గ్రామ సర్పంచ్ గడ్డం క్రాoతి తెలిపారు.మంత్రి శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలతో సోమవారం గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ముగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రజినీకాంత్,పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్,వార్డు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



