నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తొలిసారిగా ఓ భారీ సినిమా తెరకెక్కనుంది. ఇది బాలకృష్ణ నటించబోయే 112వ చిత్రం.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు పెంచింది. పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఈ చిత్రం ఎంత భారీ స్థాయిలో ఉండ బోతుందో సూచించింది.
ఇద్దరు విజయవంతమైన నిర్మాతలు ఎస్.ఎల్.వి. సినిమాస్ సుధాకర్ చెరుకూరి, యువసుధ ఆర్ట్స్ సుధా కర్ మిక్కిలినేని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ అమరావతి సమీపంలోని వెంకటాయ పాలెంలో ఉన్న టీటీడీ ఆలయంలో ఈనెల 25న గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో ఈ కార్యక్రమం మరింత ప్రతిష్టాత్మ కంగా జరగనుంది.
బాలకృష్ణ భారీ స్థాయి స్క్రీన్ ఇమేజ్‌కు సరిపోయేలా కొరటాల శివ ఒక పవర్ ఫుల్ కథని సిద్ధం చేశారు. మాస్ సినిమాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన ఇద్దరు దిగ్గజాలు తొలిసారిగా కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
కొత్త సినిమాకి ముహూర్తం కుదిరింది
- Advertisement -
- Advertisement -



