మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’.
కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
ఈ సినిమా టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు.
దర్శకుడు రవి కుమార్ సీరపు మాట్లాడుతూ,’ఈ చిత్రం లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మూవీ చూసిన తరువాత మీరు ఎక్కడ రెడ్ బ్యాగ్‌ని చూసినా మా ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా గుర్తుకు వస్తుంది. మా సినిమాకి కథే హీరో. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ హిట్ చేస్తారు. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు న్యాయం చేసేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు. ‘మూవీ చాలా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే మూవీ రిలీజ్ కాబోతోందిఅని నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి చెప్పారు. రాధ్య మాట్లాడుతూ,'ఈ సినిమా విషయంలో హరి, రవి నాకు ఎంతో సపోర్ట్ చేసారు. మేం ఎంతో కష్టపడి చిత్రాన్ని ఫినిష్ చేశాం. మా టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
మా సినిమానే గుర్తొస్తుంది
- Advertisement -
- Advertisement -



