Tuesday, June 23, 2026
E-PAPER
Homeసినిమాపరిశ్రమలో అవకాశాలు కల్పిస్తాం

పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తాం

- Advertisement -


‘టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంట్రీలు పరిశీలిస్తుంటే కొత్త వారిలో ఎంత టాలెంట్ ఉందో చూసి ఆశ్చర్యపోయామని ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఈ యంగ్ టాలెంట్ కు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి మొదటి బహుమతి లక్ష రూపాయలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. దాదాపు 60కి పైగా ఎంట్రీలు వచ్చాయి. జ్యూరీ ఛైర్ పర్సన్ ఇంద్రజ ఎంట్రీలను శ్రద్ధగా పరిశీలించి, ప్రతి షార్ట్ ఫిలింను చూసి, విజేతలను ఎంపిక చేశారు. వఈ ఏడాది ముందుగా ప్రకటించిన దానికంటే మరింత నగదు బహుమతి జోడించి, మొదటి బహుమతి రూ.20 వేలు, రెండవ బహుమతి 15 వేలు, మూడవ బహుమతి 10వేలు అందించాం. తెలంగాణ ఫిలింఛాంబర్ తరుపున ఫిలిం స్కూల్ కూడా పెట్టబోతున్నాం అని అన్నారు.
బెస్ట్ జర్నలిస్ట్ (ప్రింట్ మీడియా) – వినాయకరావు, బెస్ట్ ఫొటో జర్నలిస్ట్ – భూషణ్, బెస్ట్ జర్నలిస్ట్ (ఎలక్ట్రానిక్ మీడియా) – సతీష్, బెస్ట్ జర్నలిస్ట్ (ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్) – రఘు, బెస్ట్ కెమెరామెన్ – పాషా, బెస్ట్ వీడియో జర్నలిస్ట్ – నాగరాజు యాదవ్, బెస్ట్ జర్నలిస్ట్ (డిజిటల్ మీడియా) – రాజబాబు, బెస్ట్ ఫిలిం మేగజైన్ (బాక్సాఫీస్) – చందు రమేష్, బెస్ట్ ఫిలిం ఈపేపర్ – విజయ్, ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం – శీనుగాడి సైకిల్ స్టోరీ, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం – సైబర్ స్లేవరీ, థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం – మాతృదేవోభవ మేకర్స్ అవార్డులు దక్కించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -