చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడం తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పొల్లాచ్చిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసు కున్న చిత్ర బృందం ఈ రోజు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.
పొల్లాచ్చి షెడ్యూల్లో హై-వోల్టేజ్ యాక్షన్, ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడాన్ని పురస్కరించుకుని ‘బిహైండ్-ది-సీన్స్’ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ వీడియోలో సెట్స్‌లో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రతి సన్నివేశం వెనుక ఉన్న ప్లానింగ్, సినిమాను ఎంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారో చూడ వచ్చు. ఇందులో చిరంజీవి హుం దాగా, హై ఇంటెన్స్ కూడిన లుక్‌లో కనిపిస్తుండగా, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా షూటింగ్ లో పాల్గొనడం కనిపించింది.
ఈ వీడియోలో హైలెట్ గా నిలిచిన అంశం దర్శకుడు బాబీ కొల్లికి సంబంధించిన ఒక మూమెంట్. ఒక సన్నివేశంలో చిరంజీవి పూర్తిగా లీనమై నటించడాన్ని చూసి దర్శకుడు భావోద్వేగానికి లోన య్యారు. చిరు అద్భుతమైన నటనను చూసి ముగ్ధుడైన ఆయన ‘జీవించేశారు అన్నయ్యా` అని ఉద్వేగంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు బాబీ కొల్లి చిరంజీవిని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపించబోతున్నన్నారు. తాజాగా విడుదలైన చేసిన వీడియోలో ఆయన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి అని మేకర్స్ తెలిపారు.
హైదరాబాద్ షెడ్యూల్ మొదలైంది
- Advertisement -
- Advertisement -



