Tuesday, June 23, 2026
E-PAPER
Homeఆటలుతనయ్‌ ఆల్‌రౌండ్‌ షో

తనయ్‌ ఆల్‌రౌండ్‌ షో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ఆల్‌రౌండ్‌ షోతో మెరిశాడు. బ్యాట్‌తో, బంతితో తనయ్‌ త్యాగరాజన్‌ మెరవటంతో రంగారెడ్డి రైజర్స్‌ ఐదు వికెట్ల తేడాతో నల్గొండపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అనురాగ్‌ నల్గొండ నైట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసింది. దివేశ్‌ సింగ్‌ (48, 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), హర్షవర్దన్‌ సింగ్‌ (40 నాటౌట్‌, 20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) సహా రాహుల్‌ బుద్ది (30, 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో రంగారెడ్డి రైజర్స్‌ ఓ దశలో 6.5 ఓవర్లలో 59/4తో కష్టాల్లో కూరుకుంది. కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ (71 నాటౌట్‌, 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగగా, ఆదిత్య జవ్వాజి (41, 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. నితిన్‌ సాయి యాదవ్‌ (26 నాటౌట్‌, 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ షో చూపించాడు. 16.3 ఓవర్లలోనే 5 వికెట్లకు 190 పరుగులు చేసిన రంగారెడ్డి రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రంగారెడ్డి రైజర్స్‌ కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీజీ20 లీగ్‌ రెండో రోజు మ్యాచ్‌లకు రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, టీజీ20 లీగ్‌ చైర్మెన్‌ ఆగం రావుతో కలసి గంట కొట్టి మ్యాచ్‌ను ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -