Tuesday, June 23, 2026
E-PAPER
Homeఆటలుక్రీడా శక్తిగా 
ఎదుగుతున్న భారత్‌

క్రీడా శక్తిగా 
ఎదుగుతున్న భారత్‌

- Advertisement -

ఎంపీ రఘునందన్‌ రావు
న్యూఢిల్లీ : భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు అన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల నాల్గో రోజు పోటీల ముగింపు కార్యక్రమానికి రఘునందన్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా, ఖేలో సన్స్‌ద్‌ ఉత్సవ్‌ వంటి కార్యక్రమాలు క్రీడా విప్లవానికి నాంది పలికాయని కొనియాడారు. ఈ కార్యక్రమాలు దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాయని అన్నారు. 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపియన్లు సహా ఆసియా ఖండంలోని ప్రముఖ ఫెన్సర్లతో భారత క్రీడాకారులు పోటీపడటం దేశంలో ఫెన్సింగ్‌ క్రీడాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న జాతీయ ఫెన్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా, నిర్వాహకులు, ఇతర సహాయక సిబ్బందిని రఘునందన్‌ రావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నాలుగో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు ప్రదానం చేశారు. ఈ నెల 19న ప్రారంభమైన ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జూన్‌ 24న ముగియనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -