Tuesday, June 23, 2026
E-PAPER
Homeఆటలునితీశ్ కుమార్ రెడ్డికి గాయం..ఐర్లాండ్ సిరీస్‌కు దూరం

నితీశ్ కుమార్ రెడ్డికి గాయం..ఐర్లాండ్ సిరీస్‌కు దూరం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు జూన్ 26 నుంచి ఐర్లాండ్‌లో రెండు టీ20ల సిరీస్‌ ఆడనుంది. అయితే, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నితీశ్ తొడ కండరాలకు గాయమైంది. దీనివల్ల ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కూడా నితీశ్ ఆడకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నితీశ్ రెడ్డి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నాడు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత, కోలుకునేందుకు పట్టే సమయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -