- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఎరువుల పంపిణీలో శుభవార్త అందించింది. సాంకేతిక సమస్యలను తొలగించి, బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశారు. రైతులు తమ సొంత మండలంలోనే యూరియా పొందేలా నిబంధనలు మార్చారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు ఎరువులు చేరేలా యాప్‌ను మెరుగుపరిచారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి, ప్రతి రైతు తమ మండల పరిధిలోనే ఎరువులు బుక్ చేసుకోవాలని, ప్రతి పంటకు ఎకరానికి గరిష్టంగా రెండు బస్తాల యూరియా మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
- Advertisement -



