Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ రైతు వేదికలో కిసాన్ విత్తన మేళా

మద్నూర్ రైతు వేదికలో కిసాన్ విత్తన మేళా

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఆయన విత్తన మేళా నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మంగళవారం ఒకరోజే 670 బస్తాల యూరియాను యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్నారని తెలిపారు. ఆలస్యం చేయకుండా రైతులకు సకాలంలో యూరియాను అందించాలని సొసైటీ సభ్యులకు సూచించారు. అదేవిధంగా యూరియా యాప్ బుకింగ్ మొబైల్ అప్టేడ్ కోసం ఆయా ఏవోలను సంప్రదించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, ఉప సర్పంచ్ రమేష్, తహసీల్దార్ ముజీబ్, నాయకులు సంతోష్ మేస్త్రి, విత్తన డీలర్, ఏఈ వో సౌమ్య, సొసైటీ కార్యదర్శి గంగాధర్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -