- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియడం, ఈసారి బీజేపీ అధిష్ఠానం ఆయనను తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్జి కురియన్ సమర్పించిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటివరకు మోడీ క్యాబినెట్‌లో ఆయన మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు.. మత్స్య, పాడి, పశుపోషణ శాఖలకు కూడా సహాయ మంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహించారు. జార్జి కురియన్ రాజ్యసభ ఎంపీ పదవీ కాలం గత ఆదివారం అంటే జూన్ 21న ముగిసింది.
- Advertisement -



