Wednesday, June 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలైసెన్స్‌‌డ్‌ సర్వేయర్ల ధర్నా

లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్ల ధర్నా

- Advertisement -

రూ.30 వేల గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌
డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడిస్తాం : తెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్స్ అసోసీయేషన్ రాష్ట్ర అధ్యక్షు‌లు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్


నవతెలంగాణ-అంబర్‌పేట

రాష్ట్రంలోని రెవెన్యూ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్లకు గౌరవ వేతనం రూ.30 వేల వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌‌ నారాయణగూడలోని సర్వేభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,500 మంది లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తమను కమీషన్ ప్రాతిపదికన పనిచేయాలని సూచిం చడం అన్యాయమని, ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను ప్రారంభించి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఎటువంటి స్పష్టత, సరైన మార్గదర్శకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రెండు గ్రామ పంచాయితీలకూ ఒక సర్వేయర్‌‌ను నియమించాలన్నారు. ఉద్యోగ భద్రతతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేసి, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు బాలకృష్ణ, రాకేష్, సతీష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -