Wednesday, June 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌‌లో భారీ చోరీ

హైదరాబాద్‌‌లో భారీ చోరీ

- Advertisement -

రూ.17లక్షలతో పరారైన ఏటీఎం నగదు వ్యాన్ డ్రైవర్
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
నవతెలంగాణ- చార్మినార్

హైదరాబాద్‌‌లో భారీ చోరీ జరిగింది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో నగదు నింపేందుకు వెళ్లిన క్యాష్ వ్యాన్ డ్రైవర్ రూ.17 లక్షల నగదుతో బైక్‌‌పై పరారైన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో రీన్‌బజార్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై ఏటీఎంలలో నగదు నింపేందుకు ప్రయివేటు క్యాష్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన వాహనం మంగళవారం వెళ్లింది. సెక్యూరిటీ గార్డు, క్యాష్ సిబ్బంది ఏటీఎంలో నగదు లోడ్ చేసేందుకు లోపలికి వెళ్లారు. వ్యాన్ వద్ద ఉన్న డ్రైవర్ ఇదే అదనుగా భావించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వ్యాన్‌లోని ట్రంక్ బాక్స్‌లో ఉన్న రూ.17 లక్షలను గుట్టుచప్పుడు కాకుండా ఓ బ్యాగ్‌లోకి మార్చుకున్నాడు. అనంతరం ముందస్తుగా సిద్ధంగా ఉన్న సహచరుడు ద్విచక్రవాహనంపై అక్కడికి చేరుకోగా, నగదు బ్యాగ్‌తో కలిసి డ్రైవర్ క్షణాల్లో పరారయ్యాడు. సిబ్బంది తిరిగి వచ్చి చూసేసరికి డ్రైవర్, నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పారిపోయిన మార్గాలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నగదు రవాణా వ్యవస్థలో భద్రతా లోపాలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -