Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్ఐఆర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -

– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ 
నవతెలంగాణ – బాల్కొండ
ఎస్ఐఆర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వే లో భాగంగా బాల్కొండ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గురువారం తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ భుజంగరావు పరిశీలించారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో నమోదయ్యేలా అధికారులు, బిఎల్వోలు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -