Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందమైన క్షణాల సమాహారం

అందమైన క్షణాల సమాహారం

- Advertisement -

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా ‘తెల్ల కాగితం’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో రమేష్ బండ్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘చిలకా’ అంటూ సాగే ఈ పాటకు పూర్ణా చారి సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజయ్ బుల్గానిన్ బాణీ అయితే ఎంతో వినసొంపుగా ఉంది.
హర్ష్ రోషన్, నక్షత్రల మధ్య స్కూల్ డేస్‌లోని స్వచ్ఛమైన ప్రేమకు సంబంధించిన అందమైన క్షణాలు అందంగా బంధించినట్టు కనిపిస్తోంది. ఈ లిరికల్ వీడియోలో హర్ష్ రోషన్ వేసిన ‘హుక్ స్టెప్’ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం అని మేకర్స్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -