Monday, February 23, 2026
E-PAPER
Homeఖమ్మంసీఎం సహాయనిధి త్వరగా అందజేయండి: ఎమ్మెల్యే జారె

సీఎం సహాయనిధి త్వరగా అందజేయండి: ఎమ్మెల్యే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక భరోసా ను లబ్ధిదారులకు సకాలంలో అందించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. ఆయన సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి విభాగాన్ని సందర్శించారు.తన నియోజకవర్గమైన అశ్వారావుపేట పరిధిలోని ఐదు మండలాలకు చెందిన అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లులను ఆర్థిక సహాయం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు.

మొత్తం 270 మందికి సంబంధించిన బిల్లులను అందజేసి బాధిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సహాయం మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేయటమే కాకుండా ఎల్వోసి రూపంలో అత్యవసర సమయంలో ఖరీదైన సర్జరీలు కూడ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.ఆయన వెంట సెంట్రల్ లైటింగ్ పనుల కాంట్రాక్టర్ ఏలూరి అప్పారావు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -