Friday, June 26, 2026
E-PAPER
Homeజాతీయంప్రధానికి పోస్ట్‌కార్డ్

ప్రధానికి పోస్ట్‌కార్డ్

- Advertisement -

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ పిలుపు
28 ‌నుంచి నిరాహార దీక్ష చేస్తా : సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన ఆరో రోజూకు చేరుకుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ప్రధానమంత్రికి పోస్ట్‌కార్డ్ పంపాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు మరియం ధావలే, సీపీఐ జాతీయ కార్యదర్శి సభ్యురాలు అనీ రాజా తమ మద్దతును తెలియజేశారు. అలాగే టోక్యో పారాలింపిక్ కాంస్య పతక విజేత వినోద్ శర్మ, ప్రఖ్యాత విద్యావేత్త, యూపీఎస్సీ మెంటర్ విజేందర్ చౌహాన్, విద్యావేత్త, అభినయ మేథ్స్ వ్యవస్థాపకులు అభినయ శర్మ జంతర్ మంతర్‌ను సందర్శించి ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రపంచ యుద్ధాలను ఆపగలనని ప్రధానమంత్రి చెప్పుకుంటారని, కానీ కనీసం తన దేశంలో పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టలేకపోతున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎద్దేవా చేశారు. ఆయన సొంత మంత్రులు సరిగా బాధ్యతలు నిర్వహించటంలేదనీ, అసలు ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. సీజేపీ చేపడుతున్న ఆందోళనలో భాగంగా తాను కూడా నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. వాంగ్‌చుక్ జూన్ 28 (ఆదివారం) నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నారు. శనివారంలోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే తాను నిరాహార దీక్ష ప్రారంభిస్తానని వాంగ్‌చుక్ ప్రకటించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -