- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ గా బండారి నర్సింగం,ఉప సర్పంచ్ గా తాళ్ల రవిందర్ ఇటీవల ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టిన వారికి గ్రామంలోని అంగన్ వాడి టీచర్లు అన్నపూర్ణ, సౌజన్య, రమా లు సోమవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో శాలువాలతో సత్కరించారు. అంగన్ వాడి టీచర్లు, ఆయాలు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వం అందించే పోషకాహార పదార్థాలను లబ్ధిదారులకు అందజేయాలని సర్పంచి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, రాజమొగిలి, శ్రీవాని, సమ్మక్క, విష్ణువర్ధన్ రెడ్డి, కేశవ్ పాల్గొన్నారు.
- Advertisement -



