Tuesday, February 24, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆశ వర్కర్ల వేతనాలు విడుదల చేయాలి..

ఆశ వర్కర్ల వేతనాలు విడుదల చేయాలి..

- Advertisement -

ఆశ వర్కర్ల ముందస్తు అరెస్ట్ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

ఆశ వర్కర్లకు రావలసిన రెండు నెలల వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు రావలసిన విత్తనాలను పెండింగ్లో ఉంచిందని నిరసనగా సోమవారం హైదరాబాదులో ఆశ వర్కర్లు చేపట్టిన ధర్నాకు వెళుతున్న తంగళ్ళపల్లి మండల ఆశా వర్కర్లలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ… నాలుగు లేబర్ కోడ్లును రద్దు చేయాలి. ఆశా వర్కర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలి.

45, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేయాలి. స్కీమ్ కార్మికుల కోసం పే కమీషను నియమించాలి. రెగ్యులర్ చేసే వరకు నెలకు రూ.26వేల  స్థిర కనీస వేతనం, రూ.10వేల పెన్షన్ చెల్లించాలి. పని గంటలను ఎనిమిది గంటలకు పరిమితం చేయాలి, పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 20 రోజుల క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులను నిర్ణయించాలని కోరారు. అరెస్ట్ అయిన వారిలో తుమ్మ హిస, బూడిద వనిత, ఎం డి హఫీజ, లావణ్య, రేఖ, సునీత, కొమరవ్వ, భవాని, భారతి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -