Friday, June 26, 2026
E-PAPER
Homeజాతీయం9వతరగతి టెక్స్ట్‌బుక్‌లో పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’

9వతరగతి టెక్స్ట్‌బుక్‌లో పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’

- Advertisement -

న్యూఢిల్లీ : మొదటిసారిగా 9వ తరగతి టెక్స్ట్‌బుక్‌లో జాతీయ విద్యామండలి ‘ఎమర్జెన్సీ’ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ప్రాధమిక హక్కుల్లో చాలా వాటిని నిలిపివేసినందున.. దీనిని ప్రజాస్వామ్యానికి ఎదురైన ప్రధాన సవాళ్లలో ఒకటిగా పేర్కొంది. కొత్తగా రూపొందించిన సామాజిక శాస్త్రం టెక్స్ట్‌బుక్‌లో ‘‘అండర్‌స్టాండింగ్‌ సొసైటీ : ఇండియా అండ్‌ బియాండ్‌ ’’లో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో భారత ప్రజాస్వామ్యం బలాలు, సవాళ్లను పరిశీలన అధ్యాయంలో ఎమర్జెన్సీని చేర్చారు. 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘అత్యవసర పరిస్థితి’ కి సంబంధించిన అంశాన్ని చేర్చడం ఇదే మొదటిసారని ఎన్‌సిఇఆర్‌టి అధికారి ఒకరు ధృవీకరించారు. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. పాఠశాల పాఠ్యప్రణాళికలో ఈ అంశాన్ని చేర్చడం ఒక ప్రధాన పరిణామమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై జరిగే విస్తృత చర్చలో ఎమర్జెన్సీ ఒక భాగమని అన్నారు. ఎమర్జెన్సీతో పాటు నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, నిబంధనల ఉల్లంఘన, పేదరికం, ప్రాంతీయవాదం, సామాజిక వివక్ష , లింగ అసమానత వంటి అంశాలను కూడా ఈ పాఠ్యపుస్తకం ప్రజాస్వామ్య ఆచరణకు సవాళ్లుగా చర్చిస్తుందని ఆ అధికారి వెల్లడించారు. ఈ అధ్యాయం “ప్రజాస్వామ్యం మరియు మీరు” అనే శీర్షికతో ఒక కొత్త విభాగాన్ని కూడా పరిచయం చేస్తుందని, తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను, పౌరులుగా, ప్రజాస్వామ్యంలో వ్యవహరించడంపై విద్యార్థులకు సహాయపడేలా ఈ విభాగాన్ని మొదటిసారిగా చేర్చినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -