నవతెలంగాణ-అడ్డ గూడూరు : తెలంగాణ రాజ్యాధికార పార్టీ అడ్డగూడూర్ మండల అధ్యక్షులుగా డప్పు యాదగిరి నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులోని టీఆర్ఆర్పి పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా అడ్డగూడూరు టిఅర్పి మండల అధ్యక్షులుగా డప్పు యాదగిరి ని ప్రకటిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. గ్రామ గామాన పార్టీ నిర్మించి పార్టీ బలైపోతానికి కృషి చేయాలన్నారు. అనంతరం డప్పు యాదగిరి మాట్లాడుతూ నాపై నమ్మకంతో టిఆర్పి అడ్డగూడూరు మండల అధ్యక్షులుగా నియమించిన తీన్మార్ మల్లన్న కు , పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ, పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడిగా డప్పు యాదగిరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



