Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ

కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ

- Advertisement -

నవతెలంగాణ-అడ్డగూడూర్ : కుల మతాలకు అతీతంగా , మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ ,ముస్లింల సోదర భావంతో ప్రతి ఏటా పీర్ల పండుగను మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో భక్తులు ఏకమై ఘనంగా వైభవపేతంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డప్పు చప్పులతో కాసేపు భక్తులు పీర్లను ఎత్తుకొని అలువా ఆడారు. కొంతమంది భక్తులు పది రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టారు. డబ్బు చప్పులతో ప్రధాన వీధుల్లో పీర్లను ఎత్తుకొని ఊరేగించి పీర్ల కొట్టంలో అలువా ఆడుతూ పీర్లను ప్రతిష్టించారు. పీర్ల పండుగలో పాల్గొన్న భక్తులు గ్రామ సర్పంచ్ పూజారి వనజ సైదులు గౌడ్ , సకినాల ఇస్తారీ , బోయపల్లి యాదగిరి , పూజారి యాదగిరి , నీరటి పరుశరాములు , భక్తులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -