నీల గ్రామ సర్పంచ్ క్యాతం యోగేష్
నవతెలంగాణ – రెంజల్
నీలా గ్రామ సర్పంచ్ క్యాతం యోగేష్ పై అవినీతి ఆరోపణల కొరత నటించడం సరైన పద్ధతి కాదని ఆయన పత్రిక ముఖంగా తెలియజేశారు. నన్ను గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం నా పాలకవర్గ సభ్యులతో కలిసి పని చస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి అవినీతిని అడుగడుగునా ఆపే ప్రయత్నం చేశాను. కానీ ఆయన చేసిన అవినీతి వల్ల తమ పాలకవర్గానికి చెడ్డ పేరు వచ్చింది అని బిల్లులు సరిగా లేవని తమకు సోకేజ్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. బిల్లుల వ్యవహారం చెక్కులు మంజూరు చేసే బాధ్యత మొత్తం కార్యదర్శి చూసుకోవాలన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అవినీతి ఆరోపణల బురదను అంటించడం సరైంది కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



