Saturday, June 27, 2026
E-PAPER
Homeమానవిఇలా శుభ్రం చేద్దాం…

ఇలా శుభ్రం చేద్దాం…

- Advertisement -

వంటగదిలో పాలు మరిగించడం ప్రతి ఇంట్లో రోజూ జరిగే సాధారణ పని. అయితే ఒక్కోసారి అజాగ్రత్తగా ఉంటే పాలు పొంగి పొర్లిపోవడం, గిన్నె అడుగున మాడిపోవడం సాధారణంగా జరుగుతూంటుంది. పాలు మాడిపోయిన తర్వాత గిన్నె అడుగున ఏర్పడే నల్లటి పొరను తొలగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపు రుద్దినా ఆ మచ్చలు పూర్తిగా పోకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
అయితే ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మ తొక్కలు వంటి పదార్థాలు మాడిపోయిన గిన్నెను తిరిగి కొత్తదానిలా మెరిపించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముందుగా ఒక పెద్ద పాత్రలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల వెనిగర్, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమంలో మాడిపోయిన గిన్నెను పూర్తిగా మునిగేలా ఉంచాలి. గిన్నె అడుగున ఉన్న నల్లటి పొర ఈ ద్రావణం ప్రభావంతో క్రమంగా మెత్తబడుతుంది. కనీసం ఒకటి నుంచి రెండు గంటల వరకు అలాగే ఉంచితే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.ఇందులో కొన్ని నిమ్మ తొక్కలను కూడా వేస్తే శుభ్రం చేయడం మరింత సులువు. నిమ్మకాయలో ఉండే సహజ ఆమ్ల గుణాలు మొండి మరకలను కరిగించడంలో సహాయపడతాయి. అలాగే మాడిన పాల వల్ల వచ్చే దుర్వాసనను కూడా తగ్గిస్తాయి.

గిన్నెను ద్రావణంలో నానబెట్టిన తర్వాత బయటకు తీసి సాధారణ స్క్రబ్బర్‌తో తేలికగా రుద్దితే నల్లటి పొర సులభంగా తొలగిపోతుంది. కొన్ని సందర్భాల్లో పాలు బాగా మాడిపోవడం వల్ల గిన్నె అడుగున మందపాటి నల్లటి పొర ఏర్పడుతుంది. అలాంటి సమయంలో గిన్నెను 2 నుంచి 3 గంటల పాటు లేదా అవసరమైతే రాత్రంతా ఈ ద్రావణంలో నానబెట్టవచ్చు. ఎక్కువసేపు నానబెట్టిన కొద్దీ మురికి మరింత సులభంగా వదులుతుంది. దీంతో గిన్నెను బలంగా రుద్దాల్సిన అవసరం ఉండదు. పాలు మాడిపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పాలు మరిగేటప్పుడు వంటగదిని వదిలి వెళ్లకూడదు. మంటను సిమ్ లో ఉంచాలి. పాలు మరిగే సమయంలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండటం మంచిది. అవసరమైతే మొబైల్‌లో టైమర్ పెట్టుకోవచ్చు. అలాగే మందపాటి అడుగు ఉన్న గిన్నెల్లో పాలు మరిగిస్తే మాడిపోయే అవకాశం తగ్గుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -