Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొమ్మకల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

బొమ్మకల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
మండలంలోనిబొమ్మకల్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలోని వివరాలను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలు, మార్పులు-చేర్పులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను ఓటరు జాబితాలో ఒకసారి పరిశీలించుకొని, అవసరమైన పత్రాలను సమర్పించి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, బూత్ కన్వీనర్ గిరగాని రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -