Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల-నాగులమ్మ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి

తాడిచెర్ల-నాగులమ్మ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల-నాగులమ్మ క్రాస్ వరకు రోడ్డు మరమ్మతుల పనులు వెంటనే చేపట్టాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రోడ్డు పనులు చేపట్టాలని మల్లారం, దబ్బగట్టు గ్రామాల ప్రజలు ఆందోళన, నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బాపు సంగిభావం పలికి మాట్లాడుతూ.. కొయ్యూరు నుంచి తాడిచెర్ల వరకు రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలని కోరారు. నిత్యం బొగ్గు లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్ తో వెళ్లడంతోనే  రోడ్డు ధ్వంసం అయిందన్నారు. రోడ్డుకు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రహదారులు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారం వార్డు సభ్యుడు బోగే సదానందంతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -