నవతెలంగాణ-ఆలేరు టౌన్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పై ఈనెల 27న జరుగు మహా ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మకంటి బాలరాజు కడారి రమేష్ బాబు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం 27 గురువారం ఉదయం 10:30 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయనికి రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు తరలిరావాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కోశాధికారి మామగాని బుగ్గయ్య వీ యాదగిరి బి ఆంజనేయులు చంద్రమౌళి లక్ష్మీనారాయణ ఆలీముద్దీన్ ఆనందం తదితరులు పాల్గొన్నారు.



