చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శకుడిగా, ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయితగా పేరొందిన కె.భాగ్యరాజ్ (73) ఇకలేరు.
గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు భాషల్లో 75కి పైగా సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
కె.భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజా దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు.
భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లాద చిత్రంగళ్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో చిత్రాల్లో భిన్న పాత్రలతో అలరించారు.
ఆయన కేవలం నటుడు, దర్శకుడి గానే గాక, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ‘అన్థా 7 నాట్కళ్’ (రాధా కళ్యాణం), ‘ముంధానై ముడిచ్చు’ (మూడు ముళ్లు), ‘దూరల్ నిన్ను పోచ్చు’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేకై, ఘనవిజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రాలకు ఆయనే కథ అందించారు.
ఇటీవలే తెలుగులో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు.
భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన ‘భాగ్య వారపత్రిక’కు సంపాద కుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు.
1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ‘ముందనై ముడిచ్చు’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. ఆమె మరణం తర్వాత పూర్ణిమ జయ రామ్‌ను పెళ్లాడారు. వీరిద్దరికీ ఇద్దరు సంతా నం. కొడుకు శంతను భాగ్యరాజ్ హీరోగా, కూతురు శరణ్య హీరోయిన్గా రాణిస్తున్నారు.
ఈ ఏడాదిలో 50 ఏళ్ల సినీ ప్రస్తానం పూర్తి చేసుకోనున్న తరుణంలో మళ్లీ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు.
ఇద్దరు రాజుల్ని కోల్పోయాం
భాగ్యరాజ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతికి లోన య్యారు.
50 ఏళ్ల క్రితం నేను పరిచయం చేసిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేరు. దిగ్గజ దర్శకుడు, గురు తుల్యులు భారతీరాజా ఇదే నెలలో మరణించారు. ఒకే నెలలో తమిళ చిత్ర పరిశ్రమ ఇద్దరు రాజులను కోల్పోయింది. ఇదెంతో బాధాకరం.
కమల్ హాసన్
భాగ్యరాజ్ మృతి వార్తతో నా హృదయం ముక్కలైంది. గురు వారం ఖుష్బూ కుమార్తె పెళ్లిలో మేమిద్దరం కలిశాం. సరదాగా జోకులు వేసుకుంటూ ఫొటోలు తీసుకున్నాం. టాలెంటెడ్ దర్శకుడు, అద్భుతమైన స్క్రీన్‌ప్లే రచయిత, గొప్ప నటుడు, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – చిరంజీవి
తమిళ చిత్ర పరిశ్రమలో దర్శ కుడిగా, హీరోగా భాగ్యరాజ్ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదిం చుకున్నారు. ప్రేమ, కుటుంబ కథలను ఆయన మలచిన విధానం ఒక తరం ప్రేక్షకులను మెప్పిం చింది. – పవన్ కళ్యాణ్
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ ఇకలేరు
- Advertisement -
- Advertisement -



