Monday, June 29, 2026
E-PAPER
Homeదర్వాజజన్ జి!

జన్ జి!

- Advertisement -


అన్ని తరాలు
గానుగెద్దుల్లా కాలాన్ని మోయవు
అవి బొద్దింకలే కావచ్చు
ఒకచోట గుమిగూడితే
ప్రకంపనలు!
ఒక తరం తర్కించుకుని
ఏకాభిప్రాయానికి వచ్చిందా
గత కాలపు విలువలన్నీ
తలకిందులు కాక తప్పదు!
ప్రజాస్వామ్యం
ప్రమాదంలో పడినప్పుడు
ఒక్క ఇంస్టాగ్రామ్ చాలు
వరుస తుఫానులు
సృష్టించడానికి!
బలమైన చేతులు ఇకపై
గోళ్లు గిల్లుకుంటాయనే
భ్రమలొద్దు
పునాదులు తవ్వి చూస్తాయి
చేతుల్లోని మొబైల్స్
అందర్నీ ఏకం చేస్తాయి!
ఒక్క పిలుపు చాలు
మేడిపండు ప్రజాస్వామ్యమా
నీ రహస్య తంత్రులను తెంచి
నిప్పులు రాజేయడానికి!
దేశపు వెన్నెముకలు
నిటారుగా నిలబడ యత్నిస్తుంటే బ్రతకలేక బ్రతుకీడుస్తున్న
పెద్ద తరమా
లేచి చప్పట్లు కొట్టక తప్పదు!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -