నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య రామమందిర్ విరాళాల్లో భారీ అవకతకవలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో 8మందిని అరెస్ట్ చేశారు. అదే విధంగా రామ్ తీర్ధ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్, మరో బోర్డు సభ్యుడు రాజీనామా చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల స్వగ్రామాల్లో అధికారులు పర్యటించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ విరాళాల డబ్బులతో విలాసాలు, లగ్జరీ హౌస్ లు నిర్మించుకున్నారని అధికారులు గుర్తించారు.
అరెస్టయిన 8మందిలో అనుకలాప్ మిశ్రా, అతని బామమరిదీ లవకుశ్ మిశ్రా బసవ గ్రామంలో అత్యంత విలాసవంతమైన నివాసాన్ని నిర్మించారు. విరాళాల సొమ్మును దారి మళ్లీంచడంలో ఇరువురు కీలక పాత్ర పోషించారు. భక్తులు సమర్పించే నగదు తో పాటు భారీ విలువ చేసే కానుకులను పక్క దారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. ఆ సొమ్ముతో అనుకల్ప్ మిశ్రా తన గ్రామంలో విలాస వంతమైన ఫామ్ హౌజ్ ను నిర్మించారని తెలిపారు.
అదే విధంగా భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. లగ్జరీ కారుతో పాటు ఇటీవలె అనుకల్ప్ మిశ్రా ఇటీవల గ్రామం శివార్లలో ఒక ఫామ్‌హౌస్‌ను నిర్మించారని స్థానికులు తెలిపారు. అలాగే, ఆయన గత ఏడాది అయోధ్యలో ఒక ఇంటిని కొనుగోలు చేశారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 65 లక్షలు ఉంటుందని కూడా సమాచారం. ఇప్పటికే ఒక వాహనాన్ని కలిగి ఉన్నప్పటికీ, మరోవైపు ‘స్కార్పియో’ (Scorpio) SUVని బుక్ చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది.



