నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలోని తిరువనంతపురం కార్పోరేషన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో యుడిఎఫ్ మహిళా కౌన్సిలర్లపై బీజేపీదాడికి దిగింది. బీజేపీ కౌన్సిలర్, విద్యా స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ చెంపజంతి ఉదయన్ యుడీఎఫ్ కౌన్సిల్ పార్టీ నేత కె.ఎస్.శబరీనాథన్ సహా మరో ఇద్దరు మహిళా కౌన్సిలర్లపై దాడికి దిగారు. కేరళ సంఘ విద్రోహ కార్యకలాపాల నిరోధక చట్టం (కాపా) కింద అరెస్టయి, ప్రస్తుతం త్రిస్సూర్‌లోని వియ్యూర్ సెంట్రల్ జైలులో ఉన్న బీజేపీ కౌన్సిలర్ ఆర్.సుగతన్‌ను పదవిలో కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్‌ల నిరసనల మధ్య కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సోమవారం మధ్యాహ్నం సమావేశం ప్రారంభమైన వెంటనే సుగతన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్ నేతలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
ఇళ్లముందు పీఎంఎవై లోగోను ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి కె.ఎం.షాజీ పేర్కొన్న వీడియో క్లిప్‌ను మేయర్ వి.వి.రాజేష్ ప్రదర్శించారు. అనంతరం నినాదాల మధ్య అజెండాలోని అంశాలను వేగంగా పూర్తి సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. మేయర్ ప్రకటన వెలువడిన వెంటనే కౌన్సిల్ హాల్‌లో యుడీఎఫ్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం నెలకొంది. మేయర్ నుండి కౌన్సిల్ హాజరు రిజిస్టర్‌ను , సమావేశ వివరాల పుస్తకాన్ని ఉదయన్ స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని, అడ్డుకున్న శబరీనాథన్ , ఇద్దరు మహిళా కౌన్సిలర్లపై దాడి చేశారు. కౌన్సిలర్ సుగతన్‌కు మద్దతుగా బిజెపి ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రిజిస్టర్, మినిట్స్ బుక్‌ను లాక్కుని చింపివేసింది. అడ్డుకునేందుకు యత్నించిన యుడిఎఫ్ మహిళా కౌన్సిలర్లపై ఉదయన్ దాడి చేసి దూషించారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానానికి ఇది నిదర్శనమని, ఈ చర్యను సహించబోమని శబరినాథన్ మండిపడ్డారు.
పాలన నిలిచిపోవడంపై తిరువనంపురంకార్పోరేషన్‌లో పాలన నిలిచిపోవడంపై బీజేపీకి వ్యతిరేకంగా యుడీఎఫ్ తొలుత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. నాలుగు కౌన్సిల్ సమావేశాలకు గైర్హాజరైతే కౌన్సిలర్ పదవి కోల్పోయే ప్రమాదం ఉన్నందున సుగతన్‌కు సహాయపడేందుకే మేయర్ గత 47 రోజులుగా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్ కె.శ్రీకుమార్ ఆరోపించారు. గతవారం బీజేపీ కౌన్సిలర్లతో జరిగిన ఘర్షణలో గాయపడిన ఎల్‌డీఎఫ్ కార్యకర్తలు సోమవారం వీల్‌చైర్లలో సమావేశానికి హాజరై నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతూ మేయర్ గూండారాజ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



