Monday, June 29, 2026
E-PAPER
Homeజిల్లాలుమర్యాద కుటుంబం.. సామాజిక సేవల్లో ఆదర్శం

మర్యాద కుటుంబం.. సామాజిక సేవల్లో ఆదర్శం

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
మండల కేంద్రానికి చెందిన మర్యాద రుక్మా రెడ్డి, మర్యాద శ్రీనివాస్ రెడ్డిలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. సొంత ఊరిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రభుత్వం పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం తాను స్థాపించిన మర్యాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్, యూనిఫాంలో పంపిణీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 170 జతల బూట్లు, 90 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.

మర్యాద రుక్మారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గ్రామ పెద్దలు, పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత పైన ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించారు. వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా నెలసరి సమయంలో తీసుకోవలసిన సాంకేతిక పద్ధతుల గురించి వివరించారు. ఆధునిక పద్ధతిలో ఉపయోగిస్తున్న పర్యావరణ రహిత పరికరాలు అందించారు.
గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి లక్షలు విలువ చేసే సొంత స్థలం విరాళం ఇచ్చారు. దేవాలయంలో ఖరీదు కలగిన సౌండ్ సిస్టమ్ ను విరాళం ఇచ్చారు.

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే: గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు బ్యాగులు, బూట్లు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం సోమవారం రోజు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మర్యాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 స్కూల్ బ్యాగులను విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ పంపిణీ చేశారు.

అమెరికాలో స్థిరపడి సొంత ఊరులో సామజిక కార్యక్రమాలకు ఆర్థికంగా సహకరించడం, చదువుకున్న పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న పేద విద్యార్థులకు బ్యాగులు, బూట్లు పంపిణీ చేయడం, చదువుకోవాలని ఆలోచనలు పెంపొందించడం పట్ల మర్యాద ఫౌండేషన్ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతగాళ్ల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కట్టా అనంతరెడ్డి , ఉప సర్పంచ్న శైలజ, నర్సింహా రెడ్డి, వెంకట్ రెడ్డి,రామచంద్రయ్య, శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -