హాజరైన పిఏసిఎస్ చైర్మన్ దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం దుబ్బపేట గ్రామంలో సోమవారం అంగరవైభవంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మరియు శ్రీలక్ష్మి, భూలక్ష్మీ,బొడ్రాయి,పోచమ్మ గ్రామ దేవతల జలదివాసం అంగారంగావైభవంగా సర్పంచ్ రవిందర్ నాయక్, గ్రామస్తుల ఆధ్వర్యంలో వెదపండితులచే నిర్వహించారు. ఈ మహోత్సవానికి తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ ఆలయం నిర్మాణం కోసం భూదానం చెసిన చైర్మన్ దంపతులను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించారు.మంగళవారం నవగ్రహ,మృత్యుముజయ హోమాలు,కుంకుమ పూజ కార్యక్రమాలు,బుధవారం శ్రీలక్ష్మి, భూలక్ష్మీ, బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టపన నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అధికసంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
దుబ్బపేటలో ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన
- Advertisement -
- Advertisement -


